చీరలు ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి-అరకులోయ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైసిపి నాయకులు సుంకరమెట్ట పంచాయతీ కేంద్రంలో బిడ్డగూడ గ్రామంలో కేక్ కట్ చేసి వృద్ధులకు స్వీట్లు, చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు, మాజీ సర్పంచ్ పాంగి చిన్నారావ్, మాజీ ఎంపీటీసీ సమర్ధి భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు కొర్రగాసి, మాజీ సర్పంచ్ గుడివాడ ప్రకాష్ రావు, మాజీ ఎంపీటీసీ బీబీ సుందర్రావు, మాజీ సర్పంచులు గొల్లూరి ప్రసాద్ రావు మొస్య, హరి బారికి అప్పలరాజు, మాజీ ఎంపీటీసీ రామ్ రామదాస్, వైసిపి నాయకులు పట్టాసి కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.










