
ప్రజాశక్తి - భీమవరం రూరల్
భీమవరం ఎం ఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కోడే వీరమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో జడ్డు బ్రహ్మాజీ వృద్ధుల ఆశ్రమంలో వంద మందికి గురువారం భోజనం అందించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కోడే యుగంధర్, సోమేశ్వర స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్ కోడే విజయలక్ష్మి మాట్లాడుతూ మూడు రోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వృద్దులకు, పేదలకు దుప్పట్లు, రగ్గులు, నూతన వస్త్రాలు, సోమేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. 400 మందికి చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో అభిమానులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పేరిచర్ల సత్యనారాయణరాజు, గంటా సుందర్‌కుమార్, గాదిరాజు రామరాజు, స్వామి, శ్రీను, రవి, బొత్స ధర్మ, బుద్దరాజు రామకృష్ణవర్మ పాల్గొన్నారు.