ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
వృద్ధుల సంరక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్కునూరు రామచంద్రరావు కోరారు. బుధవారం ప్రపంచ వృద్ధుల కోర్కెల దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో మసీదు సెంటర్ నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కుక్కునూరు రామచంద్రరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల, వృద్దుల సంరక్షణ చట్టం పటిష్టంగా అమలు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయ ఎఒ సర్వేశ్వరరావుకు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు, కార్యదర్శి కేదారేశ్వర రెడ్డి, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి సుబ్బరాయ శర్మ, గొరవ సలహాదారు బాలకృష్ణ, దాదా యాకూబ్, మల్లిఖార్జునరావు, మాధవరావు పాల్గొన్నారు.










