Aug 21,2023 18:39

వృద్ధుల కుటుంబాలకు కూరగాయల పంపిణీ

ప్రజాశక్తి - టి.నరసాపురం
    సమాజంలో ప్రతిఒక్కరూ సేవా గుణం కలిగి వుండాలని భూక్యా గోపయ్య సక్రమ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ భూక్యా వేణు గోపాల్‌ తెలిపారు. మండలంలోని టి.నరసాపురం పంచాయతీలోని కృష్ణాపురం గ్రామంలో భూక్యా గోపయ్య సక్రమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వృద్ధుల కుటుంబాలకు సోమవారం కూరగాయలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ తమ ఫౌండేషన్‌ ద్వారా సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. సక్రమ ఫౌండేషన్‌ త్వరలో మహిళలకు ఉచిత కుట్టు మిషను, శిక్షణా కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జరబల చందు భూక్యా కృష్ణ, కుంజ కిరణ్‌, భూక్యా శ్రీనివాస్‌, ధరావత్‌ గోపాలకృష్ణ, పండు, వీరభద్రుడు, భూక్యా సత్తిబాబు, ధరావత్‌ కిషోర్‌ పాల్గొన్నారు.