Jun 16,2023 00:36
వృద్ధుల భద్రతపై గోడ ప్రతులను ఆవిష్కరిస్తున్న బాపట్ల ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల: వేధింపుల నుంచి రక్షణ కల్పించి వృద్ధులు గౌరవప్రదంగా బ్రతికేలా భద్రత కల్పిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. గురువారం ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం సందర్భంగా గోడ ప్రతులను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వృద్ధుల పోషణకు, ఆస్తిపాస్తుల రక్షణకు భరోసా కల్పిస్తామని అన్నారు. సమాజంలో పెద్దలను గౌరవించే సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. సీనియర్‌ సిటిజెన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు జీవీ బ్రహ్మం, కార్యదర్శి కె శ్రీహరిరావు, కోశాధికారి సిహెచ్‌ శ్రీరామశర్మ ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు, అసోసియేషన్‌ సభ్యులు బి వెంకటేశ్వర్లు, పి వెంకటేశ్వర్లు ఎం తాతయ్య, ఎం మాల్యాద్రి రావు, పి విజయసారధి పాల్గొన్నారు.