వృద్ధాశ్రమానికి నిత్యాసర సరుకులు అందిస్తున్న సమితి ప్రతినిధులు
ప్రజాశక్తి-చీరాల: పట్టణంలోని కోటయ్య అనాథ వృద్ధాశ్రమాలయానికి గుంటూరుకు చెందిన శంభూప్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, వస్తువులు, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా చీరాల కోటయ్య వృద్ధ శరణాలయం అందజేస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించి శంభు ప్రియ సేవా సంస్థ ద్వారా అవసరమైన సామగ్రి, దుస్తులు, నిత్యావసర సరుకులు అందజే స్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో శంభుప్రియా సేవా సమితి చీరాలతో పాటు గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పేదవారికి సాయం అందించడంలోనే నిజమైన సంతృప్తి ఉంద ని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు సుగుణ, పద్మ, వెంకట సాయి, లక్ష్మి సింధు, ఇందిరాదేవి పాల్గొన్నారు.










