
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందించాలనేప్రధాన ఉద్దేశంతోనే వరుణ్ హెల్త్ సెంటర్లను ప్రారంభించారని వీటి ద్వారా ఎంతో మంది వైద్య సేవలను పొందుతున్నారని వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సత్యనారాయణ అన్నారు. బెంజిసర్కిల్ వద్ద గల వరుణ్ హెల్త్ సెంటర్ వార్షిక వేడుకలను శుక్రవారం నిర్వహించారు. సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సి బిలిటీ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఏడు హెల్త్ సెంటర్లను ప్రారంభిం చినట్లు తెలిపారు. ప్రతి హెల్త్ సెంటర్‌లో తక్కువ ధరలకు ప్రాణదార మందులు అందించే జీవనధార ఫార్మాశీలు కొనసాగుతు న్నాయన్నారు. వైద్య సేవలతో పాటు తక్కువ ధరకు వైద్య పరీక్షలు అందించి మందులను కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో వరుణ్ సిబ్బంది పాల్గొన్నారు.