
ప్రజాశక్తి-నక్కపల్లి:c ఇటీవల కురిసిన అడపా దడపా వర్షాలకు కొన్ని గ్రామాల్లో రైతులు ఆకుముడులు సిద్ధం చేసుకుని, వరి విత్తనాలు జల్లారు. బుధవారం కురిసిన వర్షం వరి నారు మడులకు ఊపిరినిచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంకా మిగిలిన ప్రాంతాల్లో నారుమడులు వేసుకునేందుకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు .
చినుకు పడితే జలమయం
కోటవురట్ల:మండల కేంద్రంలో చినుకు పడితే చాలు చిత్తడిగా మారతున్నా అధికారులు పట్టించుకోలేదు. మండల పరిషత్ కార్యాలయంలోకి నీళ్లు ప్రవేశిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రహదారి గుండా పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, వ్యవసాయ పనులకు వివిధ కార్యాలయాలకు వెళ్లే మార్గం కావడంతో ప్రయాణికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై పంచాయతీ అధికారులను అడిగితే ఆర్‌అండ్‌బి పరిధిలో ఉందంటూ తప్పించుకుంటున్నారు.