Jul 19,2023 23:54

బురదలో వెళుతున్న బస్‌

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:గత మూడు రోజుల నుంచి మండలంలో ఏడతెరిపి లేకుండా జోరుగా వర్షం కురుస్తుంది. మంగళవారం రాత్రి భారీగా వర్షం కురవడంతో బల్లుగూడ సమీపంలోని కొత్తవలసలో నూతనంగా నిర్మిస్తున్న 516 ఈ హైవే రోడ్డులో మట్టి వేసి వదిలేయడంతో పూర్తిగా బురద మయంగా మారింది. ఈ రోడ్డు గుండా వచ్చే వాహనాలు బురదలో కూరుకు పోవడంతో వాహనాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాలు నిలిచిపోయాయి. అరుకు, పాడేరు వైపు నుంచి వచ్చిన వాహనాలు ఎటు వెళ్లలేక నిలిచి పోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం స్పందించి హైవే రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.