ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 1, 2 తేదీల్లో ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్‌ఫెస్ట్-2023ను నిర్వహిస్తున్నట్లు వీసి ప్రొఫెసర్ పి.రాజశేఖర్ తెలిపారు. ఫెస్ట్‌కు సంబంధించి పోస్టర్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఫెస్ట్‌లో ఎగ్జిబిషన్‌తోపాటు పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయని చెప్పారు. రెండ్రోజులపాటు జరిగే కార్యక్రమంలో అఖిల భారత స్థాయిలో వివిధ విశ్వ విద్యాలయాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు తమ కళాకృతులను ప్రదర్శించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్కిటెక్చర్ కలశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్.స్వరూపారాణి, ఫైనాన్స్ విభాగం కో-ఆర్డినేటర్ బి.శేఖర్‌బాబు, అధ్యాపకులు డాక్టర్ షకీలా నూర్‌బాషా, పి.దేవకాంత్, బి.జాన్ రత్నబాబు, ఫైన్ ఆర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎల్.వాగ్దేవి, వైస్ ప్రెసిడెంట్ కె.రాము, బి.పవన్ కుమార్, కె.వి శ్రీనివాసరావు పాల్గొన్నారు.