ప్రజాశక్తి - ఎఎన్‌యు : అంబేద్కర్ వాద రాజకీయ వ్యాసాలతో కూడిన, ఎన్‌జె.విద్యాసాగర్ రచించిన 'ఎలుతురు' పుస్తకాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ 'అంబేడ్కర్ అందరివాడని' అన్నారు. పుస్తక రచయిత కవిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా, పత్రికా సంపాదకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా అనేక రంగాల్లో ప్రతిభావంతులని కొనియాడారు. విద్యాసాగర్ గత దశాబ్ద కాలంగా 'మట్టి చేతుల భాస' పత్రికను నడుపుతున్నారని, ఈ పత్రిక కోసం నిరంతరం వ్యాసాలు రాయటమే కాకుండా మరుగున పడిన అనేక కథలను అనేకమంది బహుజన సాంస్కృతిక యోధుల చరిత్రను వెలికి తీయడం అభినందనీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో పుస్తక రచయిత ఎన్.జె. విద్యాసాగర్, అంబేద్కర్ అధ్యయన కేంద్ర అధ్యాపకులు డాక్టర్ కె.అబ్రహం లింకన్, డాక్టర్ సిహెచ్. ప్రసాద్, విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.అనిత పాల్గొన్నారు.










