
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్‌కుమార్ కుటుంబ సమేతంగా గురువారం సాయంత్రం శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జిల్ల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు, ప్రొటోకాల్ జడ్జి మూడవ అదనపు సివిల్ జడ్జి శ్రీనివాస్, జిల్లా ఎస్‌పి రిషాంత్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. వారి వెంట చిత్తూరు ఆర్‌డిఓ చెన్నయ్య, కాణిపాకం ఎఈఓ కష్ణారెడ్డి, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ తహశీల్దార్ సుశీల, అధికారులు పాల్గొన్నారు.