ప్రజాశక్తి - భట్టిప్రోలు
గత పది పదిహేను రోజులుగా వర్షాలు లేక ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి పంట ఎండిపోతున్న క్రమంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఫైరు ఊపిరి పోసుకుంది. ఏడాది మండలంలో సుమారు 14 వేల ఎకరాలకు పైగా వరి పంటను సాగు చేశారు. తిన్నా మొన్నటి వరకు వేసవి కాలాన్ని తలపించే విధంగా ఎండలు వేశాయి. మాగాని పొలాల్లో వరి నాట్లు వేసేవారు సైతం ఎండలకు అల్లాడిపోయారు. వేసిన వరి నాట్లు కూడా సాగునీరు అందక బీటల వారిన పరిస్థితి నెలకొంది. విడుదలయ్యే సాగునీరు కూడా పూర్తిస్థాయిలో దిగువ ప్రాంతాలకు అందకపోవడంతో రైతులు చాలా అవసరం ఎదుర్కొన్నారు. వేలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన వరి పంట నీరు లేక ఎండిపోతుండటంతో రైతుల్లో కలవరం పుట్టింది . దీంతో కొందరు రైతులు హాయ్ లంజల ద్వారా పొలాలకు నీటిని నింపుకొని కాపాడుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి తరుణంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షం పైరుకు ఊపిరి పోసినట్లయ్యింది. ఇదిలా ఉండగా అద్దేపల్లి బాడవ పొలాలలో ఇంకా 500 ఎకరాల వరకు నాట్లు వేయాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాలు ఇలాగే కొనసాగితే అవి కూడా వరి నాట్లు వేసే అవకాశం కనిపిస్తుంది.










