వర్షానికి కూలిన ప్రభుత్వ ఆసుపత్రి గోడ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: గురువారం కురిసిన వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రి వెనక వైపు ప్రహరీ గోడ కూలిపోయింది. ప్రహరీ గోడ కూలిపోవడంతో ఆసుపత్రిలోనే అంబులెన్స్లు చోరీకి గురయ్యే అవకాశం ఉందని, వెంటనే ప్రహరీ గోడను నిర్మించాలని గురువారం ఒక ప్రకటనలో చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు సత్య కోరారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రహరీ గోడ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ఆరోగ్యకర వాతావరణ ఏర్పాటు చేయాలని కోరారు.










