Oct 24,2023 20:36

ఎండుతున్న పంట వివరాలను వివరిస్తున్న రైతు కేశవరెడ్డి

        ప్రజాశక్తి-పుట్లూరు   మండల వ్యాప్తంగా ఒకటిన్నర నెల నుంచి వర్షాలు లేకపోవడంతో పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, ఆముదం, కంది తదితర పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలం వ్యాప్తంగా వేరుశెనగ 45 హెక్టార్‌లో సాగు చేశారు. పుట్లూరు, ఎల్లుట్ల గ్రామాల్లో ఎక్కువగా వేరుశనగ పంట సాగు చేశారు. ఆయా గ్రామాల్లోని పొలం బెట్ట నేల కావడంతో పాటు వర్షాలు లేకపోవడంతో పంటలు పూర్తిగా ఎండు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పుట్లూరుకు చెందిన రైతు కేశవరెడ్డి మాట్లాడుతూ తనకున్న నాలుగున్నర ఎకరాల్లో రెండున్నర ఎకరా వేరుశెనగ వేశానన్నారు. దీంతో సుమారు రూ.40వేల వరకూ పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పంట ఊడలు దిగే సమయం కావడంతో భూమిలో తేమ శాతం లేకపోవడం వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. రరరరరరరరర