ఒరిగిపోయిన అరటి పంట
ప్రజాశక్తి-గొలుగొండ: బుధవారం సాయంత్రం భారీ గాలులు వడగళ్లతో కురిసిన వర్షానికి అరటి రైతులు కుదేలయ్యారు. మండలంలో పాకలపాడు గ్రామ మాజీ సర్పంచ్ కామిరెడ్డి రామన్న అనే రైతు సుమారు 10 ఎకరాల్లో అరటి తోటను, పామాయిల్ తోటను పెంచుతున్నారు. గెలలు వచ్చే సమయానికి అకాల వర్షంతో అరటి తోట, పామాయిల్ తోట నేలకు ఒరిగిపోయింది. దీంతో లక్షల్లో నష్టం ఏర్పడిందని రామన్న వాపోయాడు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి పంటకు నష్టపరిహారం వచ్చే విధంగా చేయాలని కోరాడు.










