Dec 19,2022 00:01

వరి పంట కోస్తున్న రైతులు

ప్రజాశక్తి - బుచ్చయ్యపేట
వాతావరణంలో వచ్చిన మార్పులతో వరి పంటను రక్షించుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నెల 20వ తేదీ తర్వాత వర్షాలు పడతాయన్న ప్రచారంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇప్పటికే పంట ముర పండిపోవడంతో దానిని కోయకపోతే నేల రాలిపోతుందని కొంతమంది రైతులు కోతలు మొదలుపెట్టారు. కోసినవారు అటు ఇటుగా ఆరబెట్టి కుప్పలు పెట్టేస్తున్నారు. మూడు రోజుల నుండి బుచ్చియ్యపేట మండలంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందరూ ఒకేసారి కోతలు మొదలట్టడంతో కూలీలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పక్క గ్రామాల నుండి అదనంగా రవాణాఛార్జీలు ఇచ్చి కూలీలను తీసుకొస్తున్నారు. ఈ ఏడాది మండలంలో 6500 ఎకరాలలో వరి పంట వేశారు. ఇప్పటికీ 2వేల ఎకరాల వరకు వరి కోతలు పూర్తయినట్లు తెలుస్తోంది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడతాయన్న ప్రచారం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది.