ప్రజాశక్తి - కొల్లూరు
మండలంలోని తోకలవానిపాలెం గ్రామానికి చెందిన వర్రె రంజిత్ కుమార్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుకుని ఉన్నత చదువులు చదివి లెక్చరర్‌గా పని చేస్తున్నారు. క్రీస్తుపూర్వం 10వ శతాబ్దానికి చెందిన రాక్షస గుళ్ళు సంస్కృతిపై చేసిన పరిశోధనలకు గురువారం నాగార్జున యూనివర్సిటీ విసీ రాజశేఖర్ చేతుల మీదగా గవర్నర్ పాల్గొన్న సభలో రంజిత్ కుమార్‌కు డాక్టరేట్ ప్రధానం చేశారు. తోకలవానిపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ టి కృష్ణమోహన్ వర్రె రంజిత్ కుమార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ గ్రామ యువతకు ఆదర్శంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.










