Nov 08,2022 00:01

మాట్లాడుతున్న వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌

ప్రజాశక్తి- చీడికాడ:వరిలో సుడిదోమ తెగులుపై రైతులు జాగ్రత్తలు పాటించాలని, లేదంటే పొలం పూర్తిగా దెబ్బతింటాయని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని బైలిపూడి గ్రామంలో వరి పొలాలను సందర్శించారు. ఆయన రైతులతో మాట్లాడుతూ, ఈ తెగులుతో వరి దుబ్బులు గోధుమ రంగులోకి మారి, మొక్కలు వడలి సుడులు సుడులుగా ఎండి పోతాయన్నారు. వీటి నివారణకు సుడిదోమ ప్రారంభ దశలో ఉంటే ఎకరానికి 300 గ్రాముల ఎస్పేట్‌ మందు నీటిలో పిచికారి చేసి ఎకరానికి 12 ట్యాంకులు చొప్పున స్ప్రే చేయాలన్నారు. మధ్యస్థ దశలో ఉంటే ఎస్పెట్‌ 300 గ్రామ్స్‌ తో పాటు బఫ్రో ఫెజిన్‌ 330 ఎమ్మెల్‌ ఎకరానికి పిచికారి చేసి స్ప్రే చేయాలన్నారు. సుడిదోమ తీవ్రత ఎక్కువగా ఉంటే ఎస్పేటతో పాటు పైమెట్రో జెన్‌ 120 గ్రామ్స్‌ నీటిలో పిచికారి చేసి ఎకరాకి 12 ట్యాంకుల చొప్పున స్ప్రే చేయాలన్నారు. ముఖ్యంగా పిచికారి స్ప్రే ఉదయం 10 లోపు, మధ్యాహ్నం మూడు గంటలు తర్వాత చేయాలని సూచించారు.