Jul 25,2023 20:36

వేరుశనగ పంటను పరిశీలిస్తున్న కెవికె శాస్త్రవేత్తలు

కలికిరి : చీడపీడల యాజ మాన్యంపై శిక్షణా కార్యక్రమం మంగళవారం చారవాండ్లపల్లి గ్రామంలో కలికిరి కెవికె శాస్త్రవేత్త వై.పిరుసాహెబ్‌, జిల్లా వనురుల కేంద్రం అధికారి ఎం.వి.శ్రీకాంత్‌ వరిని ఆశించే చీడ పీడల యాజమాన్యం మీద శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. వరికి సిఫారసు చేసిన మోతాదులో యూరియా వాడాలని సూచించారు. పొటాష్‌ ఎరువును ఎకరాకి 25 నుంచి 30 కిలోల ఎరువును విధిగా వాడాలని సూచించారు. వరిలో ప్రతి రెండు మీటర్ల దూరంకి 20 సెంటీమీటర్ల వెడల్పుతో కాలిబాటలు తీయడం ద్వారా పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల సమస్య బాగా తగ్గుతుదని సూచించారు. ఎరువులు వేయ టానికి, అవసరాన్ని బట్టి పురుగుమందులు వాడాల్సిన పరిస్థితిలో కాలిబాటలు ఉప యోగపడతాయని, వరిని ఆశించే ఆకుమూడత పురుగు నివారణకు కార్ట్‌ఆఫ్‌ హైడ్రో క్లోరైడ్‌ మందను లీటర్‌ నీటికి రెండు గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకో వాలని తెలిపారు. వరి, వేరుశనగ పొలాలను సందర్శించారు. అప్పుడే నాట్లు వేసిన వరిలో మూడు నుంచి ఐదు రోజుల లోపు నాటిన దశలో ఎకరానికి 500 మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్‌ మందును 20 కిలోలు ఇసుకలో కలిపి పొలంలో చల్లుకో వాలని తెలిపారు. వేరుశనగలో ఒకటి రెండు ఆకులలో పురుగు నష్టం చేసినంతమాత్రాన అనవసరంగా అయిదు నుంచి ఆరువేల రూపాయల పురుగుమందులను వాడవలసిన అవసరం లేదని తెలిపారు. పంట తొలి దశలో ఆకులకు పురుగుల వలన కొంత నష్టం జరిగినా కొత్తగా వచ్చే ఆకులతో ఆ నష్టాన్ని నివారించే శక్తి మొక్కకు ఉంటుందని తెలిపారు. మొక్కల సాంద్రత తగినంతగా ఉంచుకోవడానికి విత్తనం వేసే ముందు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడే మందుతో విత్తని శుద్ధి చేసుకుని విత్తుకోవాలని సూచించారు. ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. రెండోసారి కలుపు తీసే సమయంలో ఎకరానికి 200 కిలోల జిప్సం ఎరువును వేసుకోవడం ద్వారా గింజ పరిమాణం, నూనె శాతం పెరుగుతుందని పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అగ్రి అడ్వైజరీబోర్డ్‌ చైర్మన్‌ కె.వెంకటరమణారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి బి.హేమలత, రైతులు పాల్గొన్నారు