
ప్రజాశక్తి - బల్లికురవ రూరల్
మండలంలో నక్కబొక్కలపడు రైతు భరోసా కేంద్రం వద్ద వరి నారుమళ్లు పొసే రైతులుకు అందుబాటులో ఉంచేందుకు బీజామృతం తయారు చేసే విధానంపై శనివారం అవగాహన నిర్వహించారు. బీజామృతంతో అన్ని రకాల పంటలకు వితనసుద్ది చేయవచ్చని తెలిపారు. దీనివల్ల 80రకాల చీడపీడల నుండి మొక్కను కాపాడుతుందని తెలిపారు. వేరు పురుగు ఆశించకుండా నివారిస్తుందని తెలిపారు. రైతులు అందరూ సేంద్రియ పద్దతిలో విత్తనాలు శుద్ధి చేసుకుని విత్తుకోవాలని ఏపీ సీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ రైతులకు వివరించారు. ఆవుపెడ 5కేజీలు, ఆవుమూత్రం 5లీటర్లు, సున్నం 50గ్రాములు, పిడికెడు పుట్టమట్టి ఒక బకెట్లో 20లీటర్ల నీరు, అవుమూత్రం, సున్నం కలిపి పోసుకోవాలని తెలిపారు. పేడని ఒక పలుచని గుడ్డలో మూటకట్టి ఆ బకెట్‌లో వేలాడదీయాలన్నారు. ఒక రాత్రి ఉంచి ఉదయాన్నే పేడ మూటని బాగా పిండి బయటకు తీసి ఆ మిశ్రమాన్ని వడపోసుకో కొని విత్తనాలుపై చల్లి నీడలో కొంచెం ఆరబెట్టి విత్తు కోవాలని తెలిపారు. నారు అయితే బీజామృతంలో ముంచి నాటుకోవాలని తెలిపారు. దీనివలన మొలకశాతం బాగా వస్తుందన్నారు. విత్తనాల నుండి సంక్రమించే వ్యాధులు నివారిస్తుందని తెలిపారు. వేరు పురుగులు నియంత్రించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. చీడపీడలు నివారణ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొనిదేన ఐసిఆర్పిలు శ్రీదేవి, రాంబాబు, ప్రతాప్, సోనియా, యమునా, అనూష, ఎల్2 నాగూర్ వలి, ఎల్1 చల్లగుండ్ల, కల్పన పాల్గొన్నారు.