
ప్రజాశక్తి - మాచర్ల : వరికపూడిశెల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించడంతోపాటు పను లను ప్రతినెలా సమీక్షిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ మేరకు స్థానిక వైసిపి కార్యాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ శంకుస్థాపన సభలో లక్ష మంది రైతులు పాల్గొనడంతో టిడిపి జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తోం దని విమర్శించారు. వైసిపి అధికారంలోకి రాగానే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిని 30 నుండి 50 పడకలకు పెంచా మని, సుమారు రూ.100 కోట్లతో మాచర్ల ప్రభుత్వ వైద్య శాలను 100 పడకల ఆసుప త్రిగా మారస్తామని సిఎం ప్రకటించారని చెప్పారు. పలు రహదార్లకు నిధులివ్వ డానికి, పేటసన్నిగండ్లలో మినీ లిప్ట˜్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తికి సిఎం అంగీకరించినట్లు తెలిపారు. పట్టణంలో తాగు నీటి పథకం పనులు త్వరలో జరుగుతాయన్నారు. సమావేశంలో వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చినఏసోబు, శ్రీని వాసశర్మ, కె.సాయిమా ర్కోండారెడ్డి, టి.కిషోర్, బి.రఘురామిరెడ్డి పాల్గొన్నారు.