Aug 25,2022 23:15

రైతులతో మాట్లాడుతున్న వ్యవసాయ అధికారులు

ప్రజాశక్తి- ఆనందపురం: మండలంలోని సిర్లపాలెం గ్రామంలో వ్యవసాయ శాస్త్రవేత్త పర్యటించి వరి పంటను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వరి మడులు ఎలా తయారు చేయాలి, తెగుళ్లు నుంచి ఏ విధంగా రక్షణ కల్పించాలో వివరించారు. నారు మడి వేయడానికి వారం రోజులు ముందు కార్బో పోరాన్‌, గుళికలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎం.వెంకటలక్ష్మి, కీటక శాస్త్ర నిపుణులు డాక్టర్‌ కుమారి, భీమిలి అగ్రికల్చర్‌ సంచాలకులు బి.విజరుప్రసాద్‌, పద్మనాభం వ్యవసాయ శాఖాధికారి ఎంవి.చలం, ఎంపిఇఒ రమాదేవి, దిలీప్‌, రైతులు పాల్గొన్నారు.