ప్రజాశక్తి -ఆనందపురం : వరి పంటలో మేలైన యాజమాన్య పద్ధతులపై మండలంలోని బోని గ్రామంలో శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. ఈ శిక్షణలో ఎంపిపి డాక్టర్ మజ్జి శారదా ప్రియాంక మాట్లాడుతూ, రైతులు ఆధునిక పద్ధతులను అవలంభించి వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి మాట్లాడుతూ, 122 మంది రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 250 ఎకరాల విస్తీర్ణంలో మేలైన యాజమాన్య పద్ధతులను ఆచరించినట్లు చెప్పారు. మంగళవారం 65 మంది రైతులకు, బుధవారం 57 మంది రైతులకు శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోని అప్పలనాయుడు, స్థానిక సర్పంచ్ బోని అప్పలకొండ, నాయకులు బోని సన్యాసినాయుడు, మజ్జి వెంకటరావు, ప్రకృతి సేద్యం డిపిఎం ఎ.మోహనరావు, జిల్లా వనరుల కేంద్రం ఎడిఎ సిహెచ్.సుబ్రమణ్యం, భీమునిపట్నం ఎడిఎ బి.విజరుప్రసాద్, స్థానిక వ్యవసాయశాఖాధికారి సిహెచ్.సంధ్య రత్నప్రభ పాల్గొన్నారు.










