Nov 16,2023 18:54

ప్రయోగం చేస్తున్న అధికారి

ప్రయోగం చేస్తున్న అధికారి
వరి పంట కోత ప్రయోగం
ప్రజాశక్తి-సీతారామపురం:మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన చింతనబోయిన రత్తయ్య అనే రైతుకు చెందిన వరి పంటలో గురువారం వ్యవసాయ శాఖ సిబ్బంది వరి పంట కోత ప్రయోగాన్ని నిర్వహించారు. ఇరువైపులా ఐదు మీటర్ల పొడవు వెడల్పు విస్తీర్ణం లో పంట కోతను నిర్వహించగా అందులో 14.36 కేజీల దిగుబడి వచ్చిందన్నారు. ఈ ప్రయోగం ప్రకారం ఎకరాకు సుమారు 30 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందని ఎఎస్‌ఒ కె.నాగేంద్ర, వీఏఏ నరేంద్రలు అంచనా వేశారు.