Sep 06,2023 00:42

ప్రజాశక్తి - చెరుకుపల్లి
మండలంలోని కుంచాలవారిపాలెం, రాంబట్లవారిపాలెం గ్రామాల్లోని వరి పొలాలను బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల బృందం మంగళవారం పరిశీలించారు. వరి పైరు ప్రస్తుతం బాగున్నదని అన్నారు. అక్కడక్కడ ఆకు ముడత పురుగు ఆశించినట్లు గుర్తించారు. నివారణకు కొబ్బరి తాడు గాని, ముళ్ళ కర్ర గాని, వరిపైరు పై లాగినట్లయితే ఆకుముడత పురుగులు పడిపోతాయని సూచించారు. చేలలో నీరు ఉన్నప్పుడు మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించాలని సూచించారు. ఆకు ముడత పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 6లీటర్ల వేప నూనె గాని, క్లోరి ఫైరిపాస్ 2.5ఎంఎల్‌ లీటర్ నీటికి చొప్పున పిచికారి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా వనరుల కేంద్రం డిడిఏ విజయనిర్మల, డాక్టర్ ఎంసి ఓబయ్య, డాక్టర్ సురేఖ దేవి, ఎఒ టి బాలాజీ, గంగాధర్ పాల్గొన్నారు.