Aug 27,2023 00:06

అవగాహన కల్పిస్తున్న ఎఒహొ

ప్రజాశక్తి -నక్కపల్లి:వర్షాభావ హొపరిస్థితులతో హొ హొవరి నారు ముదిరిందని, ఆ నారు నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి హొ4, 5 మొక్కలు చొప్పున నాటు కోవాలని వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్‌ రైతులకు సూచించారు. మండలంలోని శనివారం గుల్లిపాడు, ముకుందురాజుపేట, రమణయ్యపేట గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పొలాలను పరిశీలించారు. నత్రజని ఎరువును సిఫార్సు కంటే 25 శాతం హొపెంచి మూడు దఫాలుగా కాకుండా, రెండు దఫాలలో 70శాతం హొదమ్ములోను, మిగతా 30శాతం హొఅంకురం దశ లో వేసుకోవాలన్నారు. వరి నారుమడులలో అక్కడక్కడ గుంపులు గుంపులుగా నారు చనిపోతుందని, ఇది పొడ తెగులు లక్షణమని, దీనిని నివారించేందుకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ తెగులు ఉధృతి పెరగకుండా నారుమడి కాపాడుకోవడం కోసం వెంటనే హొలీటర్‌ నీటికి 2 మిల్లీ లీటర్ల చొప్పున హెక్సాకొనజోల్‌ మందును కలిపి, ఎకరా నారుమడికి కనీసం ఒక ట్యాంకు పిచికారి చేయాలన్నారు. ఇప్పటికే వరి ఉడుపులు పూర్తయి 15 రోజులు దాటిన పొలాల్లో హొఅంబటి కాడ, గరిక, తీగజాతి, తుంగ వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నాయని, వీటి నియంత్రణకు బిస్‌ ఫైరీబ్యాక్‌ సోడియం కలుపు మందును 80-100 మిల్లీలీటర్ల చొప్పున, ఆల్‌ మిక్స్‌ 8 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకర పొలంపై పిచికారి చేస్తే అన్ని రకాల కలుపు మొక్కలు చనిపోతాయన్నారు.ఖచ్చితంగా వరి పొలాలలో 20 రోజులలోపు ప్రతి రెండు మీటర్ల కి ఒక అడుగు చొప్పున కాలిబాటలు తీసుకోవాలని ,తద్వారా గాలి, వెలుతురు పొలంలో బాగా తగిలి చీడపీడల ఉధతి తగ్గుతుందన్నారు. వరి ఉడి చేటప్పుడు ఎరువులు వేయని రైతులు హొఎకరానికి ఒక బస్తా డిఏపి, 20 కిలోల పొటాష్‌ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హొ హొకర్రి హొశ్రీనివాస్‌, గ్రామ సహాయ వ్యవసాయ అధికారులు రాజేష్‌, సత్యనారాయణ, రుఫియా పాల్గొన్నారు.