Apr 29,2023 22:51

కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పరిశీలిస్తున్న జెసి ఇలాక్కియా


- జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియా
ప్రజాశక్తి - పెద్దాపురం
రాబోయే రెండు రోజుల్లో వర్ష సూచనలు ఉన్నందువల్ల వరి కోతలు వాయిదా వెయ్యాలని జాయింట్‌ కలెక్టర్‌ ఇలాక్కియా రైతులకు విజ్ఞప్తి చేశారు. శనివారం పెద్దాపురం మండలం జి.రాగంపేట రైతు భరోసా కేంద్రం పరిధిలో ధాన్యం ఆరబెట్టిన కళ్లాలను పరిశీలిశారు. అనంతరం జెసి మాట్లాడుతూ వరి కోతలు, ధాన్యం ఆరబెట్టడంలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ధాన్యం అమ్మకంలో ఉన్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎంటియు 1156, ఎం టి యు 1121 రకాలు నూక శాతం ఎక్కువగా వస్తుందని ఈ విషయంలో ప్రభుత్వ నుంచి తగు చర్యలు తీసుకోవాలని రైతులు జెసికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోపరేటివ్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ మసకపల్లి శ్రీ రంగనాయకులు, ఎడిఎ దైవ కుమార్‌, ఎఒ సంజరు, రైతులు కంటే రామకృష్ణ, బిక్కిన భీమేశ్వరరావు, బండారు శివ, పాలచర్ల బాపిరాజు, సురేష్‌, రైతు భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.