Jul 28,2022 23:26

పిఎం.పాలెంలో విరాళాలు సేకరిస్తున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి-పెందుర్తి : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద బాధితుల సహాయార్థం సిపిఎం ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టారు. పెందుర్తి కూడలిలో సిపిఎం జోన్‌ కార్యదర్శి బి. రమణి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్మిక కర్షక పేదలకు సిపిఎం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. దాతల నుంచి సేకరించిన విరాళాలను వరద బాధితులకు సిపిఎం అందజేస్తుందన్నారు. గతంలో హుదూద్‌ సమయంలోనూ సిపిఎం బాధితులకు అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలరాజు శంకర్రావు ఈశ్వరరావు విశ్వనాథన్‌ ఇద్వా నాయకులు రజిని పాల్గొన్నారు
పిఎం.పాలెం: వరద బాధితుల సహాయార్థం కొమ్మాది నుంచి మధురవాడ కూడలి వరకు సిపిఎం మధురవాడ జోన్‌ కమిటీ విరాళాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో మధురవాడ జోన్‌ సిపిఎం కార్యదర్శి డి అప్పలరాజు, పి రాజ్‌కుమార్‌, జి కిరణ్‌, విజరు, కె పైడిరాజు, సిహెచ్‌ బాబు, వి సంధ్య, బి కొండమ్మ, లలిత పాల్గొన్నారు.