Jul 27,2022 23:19

విశాఖపట్నం పోర్టులో వరద బాధితుల సహాయ నిధి వసూలు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : యునైటెడ్‌ పోర్ట్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన విశాఖపట్నం పోర్టులో బుధవారం వరద బాధితుల సహాయ నిధి వసూలు చేశారు. మన రాష్ట్రంలో గత వారంలో వరద బీభత్సం సృష్టించడంతో అనేకమంది నిరాశ్రయులు అయ్యారని, వారిని ఆదుకోవడానికి పోర్టు కార్మికులుగా సహాయం చెయాలని సిహెచ్‌డి, మెరైన్‌ తదితర విభాగాల్లో సహాయ నిధిని సేకరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్‌ పోర్ట్‌ డాక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ, అధ్యక్షులు డి.సాంబమూర్తి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిహెచ్‌ త్రినాథరావు, డిఎల్‌బి వర్కర్స్‌ యూనియన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జక్కన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.