వరద బాధితులకు అండగా శివన్నారాయణ
ప్రజాశక్తి - తాళ్లరేవు
ముమ్మిడివరం ఎఎంసి చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ వరద బాధితులకు అండగా నిలిచారు. మండలంలోని పిల్లంక పంచాయతీ పరిధిలోని కొత్తలంక గ్రామంలో సుమారు 600 మందికి మంగళవారం ఇంటింటికి వెళ్లి బిర్యానీ ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా శివన్నారాయణ మాట్లాడారు. ప్రతి ఏడాది లంక గ్రామాలు వరద ప్రభావంతో అల్లాడిపోతున్నాయన్నారు. ప్రజలు వరద తాకిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అటువంటి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వం కలిగిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు మరింత మంది ముందుకొచ్చి సాయం అందించాలన్నారు. ఆయన వెంట పిల్లంక ఉప సర్పంచ్ కాగిత రాజు, ఎంపిటిసి సభ్యులు కూరాటి శ్రీకృష్ణ, వాలంటీర్ అయితాబత్తుల గోపాలకృష్ణ, యువ నాయకులు కుడుపూడి శ్రీనివాస్, పెసింగి శివ, సచివాలయ కార్యదర్శి శివప్రసాద్, యువకులు పాల్గొన్నారు.










