Oct 13,2022 15:56

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : రంపచోడవరం డివిజన్ పరిధిలోని వందన్ వికాస కేంద్రాలు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే అన్నారు. గురువారం రంపచోడవరం ఐటిడిఎ సమావేశపు మందిరంలో ఏపి డి వెలుగు, జిసిసి మేనేజర్, డిపిఎం లు, ఏపీయం లు, వందన వికాస కేంద్రాల లీడర్లతో వందన్ వికాస కేంద్రాల అభివృద్ధిపై ప్రాజెక్ట్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే  మాట్లాడుతూ, ఏజెన్సీ ఏడు మండలాలలో 110 వందన్ వికాస కేంద్రాలు ఉండగా   ఒక్కొక్క వందన్ వికాస కేంద్రానికి 300 మంది నెంబర్లు ఉన్నారని, వందన్  కేంద్రాలకు ఒక కోటి 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఒక్కొక్క వందన వికాస కేంద్రాలలోని సభ్యుల నుండి వెయ్యి రూపాయలు వాటాదనం కట్టించాలని ప్రొజెక్టర్ అధికారి ఎ పియం లను ఆదేశించారు. అన్ని మండలాలలోని ఎన్ని వందల వికాస కేంద్రాలు  ఉన్నది, ఇప్పటివరకు ఎన్ని ప్రాసెసింగ్ మిషన్లు కొనుగోలు చేసింది, మండలాల వారిగా ఆయన ఆరా తీశారు. ఒక్కొక్క వందన వికాస కేంద్రాల లీడర్ల ఆధ్వర్యంలో ఎంతమంది సభ్యులు ఉన్నది  ప్రాజెక్ట్ అధికారి అడిగి తెలుసుకున్నారు,గత సంవత్సరం జీడిపిక్కలు, చింతపండు, పసుపు ఎన్ని టన్నులు  కొనుగోలు చేసింది ఏ విధంగా ప్రాసెసింగ్ చేసింది ఏ విధంగా మార్కెట్కు పంపింది ఎంత డబ్బులు ఖర్చయింది ఎంత ప్రాఫిట్ వచ్చింది తదితర వివరాలు ప్రాజెక్ట్ అధికారి అడిగి తెలుసుకున్నారు,వై రామవరం మండలం,మారేడుమిల్లి మండలాలలో ఎన్ని సీట్లు కొనుగోలు చేసింది ప్రాజెక్ట్ అధికారి ఆరా తీశారు, ప్రతి వందన వికాస కేంద్రానికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలని అదేవిధంగా తీసుకున్న  రుణాలు  సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు. వందన్ వికాస కేంద్రాలలోని సభ్యులకు ఎన్ని ఎకరాల జీడి మామిడి తోటలు ఉన్నది ఆయా రైతులు మామిడి పిక్కలు వందన్ వికాస కేంద్రాలకు అమ్మే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు,వందన్ వికాస కేంద్రాల సభ్యులందరికీ శిక్షణ ఇవ్వాలని ప్రాజెక్ట్ అధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు. వందన వికాస కేంద్రాలకు సంబంధించిన రిపోర్టులు,వెలుగు సంఘాలకు సంబంధించిన రిపోర్టులు ఎప్పటికప్పుడు సకాలంలో సమర్పించాలని సంబంధిత అధికారులను ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు,వందన్ వికాస కేంద్రాలకు సంబంధించిన షెడ్లు లేనియెడల అద్దెకు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు, వందన్ వికాస కేంద్రాలకు ఏమైనా సమస్యలు ఉన్నయెడల తమ దృష్టికి తీసుకురావాలని  ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపిడి, ఎ  శ్రీనివాసరావు,డిపియం లు, పరమేశ్వర రావు, జిసిసి మేనేజర్ పార్వతీశం, అపర్ణ, యాంకర్ పర్సన్ సీతారామరాజు, ఏపీయం లు, దుర్గాప్రసాద్, అప్పారావు, మధు, శ్యాం కుమార్, రాజు,ఆదినారాయణ, జేమ్స్, వందన్ వికాస కేంద్రాల లీడర్లు  తదితరులు పాల్గొన్నారు.