జూ పార్కులో పాపాహోమ్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులు
ప్రజాశక్తి - ఆరిలోవ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల, ఎడ్యుకేషన్ బృందం ఆధ్వర్యంలో జూపార్కులో విద్యార్ధులకు పాపాహోమ్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా విద్యార్ధులకు జూ పార్కులో ఉన్న జంతువులను చూపిస్తూ వాటి గురించి వివరించారు. జూ బయోస్కోపు మందిరంలో నిర్వహించిన జంతువులకు సంబంధించిన యాక్టివిటీలో డిఎఫ్‌ఒ అనంత శంకర్, క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా పాల్గొని ఫోటోలలో ఉంచిన వివిధ రకాల జంతువుల చర్మాలను గురించి వివరించి, విద్యార్థులతో చెప్పించారు. విద్యార్ధుల కోసం ట్రెజరర్ హంట్ గేమ్ నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్ధులకు జంతువుల ఆకారంలో ఉన్న మాస్క్‌లను, సర్టిఫికేట్లను, బహుమతులను అందజేసారు.










