బాధితులతో మాట్లాడుతున్న జడ్జి రత్నకుమార్
ప్రజాశక్తి-గుంటూరు లీగల్: గుంటూరు మహిళా ప్రాంగణంలోని వన్‌స్టాప్ సెంటర్‌ను సోమవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.రత్నకుమార్ సందర్శించారు. అక్కడున్న బాదితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి కావాల్సిన న్యాయపరమైన సలహాలు ఇచ్చి అవసరమైతే న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. వన్‌స్టాప్ సెంటర్ రికార్డులను పరిశీలించారు. అక్కడే ఉన్న సదార్ హోంలో ఉన్న బాదితులను పరామర్శించారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ ప్యానల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, వన్‌స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సిలర్ విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.










