మంచు కారణంగా లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడు
ప్రజాశక్తి-సీలేరు
జీకే.వీధి మండలం సీలేరు, దారకొండ, దుప్పిలివాడ పరిసర ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. రెండు రోజులుగా రాత్రి 8 గంటలకే 13, 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత ఎక్కువైంది. చలి తీవ్రత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు కమ్మేయడంతో చలి ప్రజలను గజగజ వణికిస్తోంది. సీలేరు నుంచి మైదాన ప్రాంతానికి వాహనాలపై వెళ్లాలంటే మంచు కారణంగా రహదారులు కనిపించడం లేదు. చలికి తాళలేక మంటలు వేసుకొని, ఉన్ని దుస్తులు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత అధికమై ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన చెందుతున్నారు.










