Jul 25,2023 00:09

కాఫీ తయారీని పరిశీలిస్తున్న కాంతిలాల్‌ దండే

ప్రజాశక్తి- అనంతగిరి:ఏజెన్సీ ప్రాంతంలో మారు మూల గ్రామాలకు రహదారుల సౌకర్యార్థంగా నిర్మిస్తున్న వంతెనల పనులు డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ట్రైబల్‌ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ. కాంతిలాల్‌ దండే ఆదేశించారు. సోమవారం మండలంలో సుడిగాలి ప్రకటించారు. మండలంలోని ఎగువసభ పంచాయతీ బీసుపురం గ్రామంలో సందర్శించారు. కాఫీ పౌడర్‌ తయారీ విధానం పై అడిగి తెలుసుకున్నారు. కాశీపట్నం పంచాయతీ పరిధి సారవనిపాలెం, చిలకలగెడ్డ పంచాయతీ జీలుగులపాడులో జరుగుతున్న వంతెనలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులకు సంబంధించి సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వంతెనల పనులు వేగవంతం జరిగేందుకు తగిన ప్రణాళికను తయారు చేసి నివేదిక అందజేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు పీఒ. అభిషేక్‌ ను ఆదేశించారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ శ్రీనివాస్‌, డిఇ.సుబ్బారావు, జెఇ.గణేష్‌ పాల్గొన్నారు
సమస్యలపై వినతి..
పంచాయతీలో నెలకొన్న పలు సమస్యలపై స్థానిక ఎంపీటీసీ టీ.మిత్తుల, సర్పంచ్‌ జి.అప్పారావు ట్రైబల్‌ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ. కాంతిలాల్‌ దండె కు లిఖితపూర్వకంగా విన్నవించారు. జీలుగులపాడు వంతెన పనులు పూర్తి చేస్తే అనంతగిరి మండలం, విజయనగరం జిల్లా మెంటాడ మండలం అడ్డతీగల పంచాయతీ ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు.
ౖ జెడ్‌పిటిసి గంగరాజు వినతి
అనంతగిరి:విద్యాశాఖ సమస్యలు, మాతృభాష వాలంటిర్లు, సిఆర్‌టిల సమస్యలు పరిష్కారం చేయాలని జడ్పిటిసి దీసరి గంగరాజు కోరారు. ఈ మేరకు ట్రైబల్‌ వెల్ఫేర్‌ ప్రదాన కార్యదర్శి కాంతిలాల్‌ దండేకు లిఖితపూర్వకంగా విన్నవించారు. ఈ సందర్బంగా గంగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1242 మంది మాతృభాష వాలంటీర్లు పని చేస్తున్నారని, సుమారు 50000 మంది గిరిజన విద్యార్థులకు మాతృభాషలో విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ మాతృభాష వాలంటీర్లను ప్రతి ఏడాది కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాష వాలంటీర్ల జిల్లా అధ్యక్షులు పాంగి .కుమారి, వాలంటర్లు పాల్గొన్నారు.