Jun 27,2023 23:41

ప్రజాశక్తి - తాళ్లరేవు చెత్త ఇలా.. సాగునీరు పారేదలా... అనే శీర్షికన ప్రజాశక్తిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. మండలానికి వచ్చే ప్రధాన సాగునీటి కాలువపై ఇంజరం, కోలంక వంతెన దిగువ ఉన్న కల్వర్టు వద్ద కొద్దిరోజులుగా భారీ ఎత్తున చెత్త పేరుకుపోవడంతో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఆర్‌ అండ్‌ బి శాఖ అధికారులు స్పందించి యంత్రాల సహాయంతో చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన కాలువలో సాగునీరు ఫ్లోటింగ్‌ లేకపోవడం వల్ల చెత్త పూర్తి స్థాయిలో యంత్రానికి అందుబాటులోకి రాక పాక్షికంగా మాత్రమే చెత్తను తొలగించారు. పూర్తిస్థాయిలో చెత్త తొలగించాలంటే తాళ్ళరేవు ప్రధాన ఛానల్‌కు నీటిపారుదల శాఖ అధికారులు ఒకరోజు ప్రత్యేకంగా సాగునీటి వంతు కేటాయిస్తే గాని ఈ సమస్య పరిష్కారం కాదు.