ప్రజాశక్తి- డుంబ్రిగూడ: మండలంలోని గసభ పంచాయతీ లోగిలిగెడ్డ వద్ద వంతెన నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో స్థానిక ఎమ్మెల్యే ఫాల్గుణ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో రోడ్లు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రోడ్లు, డ్రైనేజీ కాలువలకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరి, జడ్పిటిసి సిహెచ్ జానికమ్మ, స్థానిక పంచాయతీ సిపిఎం సర్పంచ్ పి సునీత, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సమస్యలపై సిపిఎం సర్పంచ్ వినతి
లోగిలి గెడ్డ వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సందర్శించిన స్థానిక ఎమ్మెల్యేకు స్థానిక గసభ పంచాయతీ సిపిఎం సర్పంచ్ పి.సునీత పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పంచాయతీ పరిధిలోని 14 గ్రామాల్లో సిమెంట్ రోడ్లు మంజూరు చేయాలని, ముర్రిగూడలో తారు రోడ్డు పనులు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులు పున్ణప్రారంభించాలన్నారు. గసభ ఎంపీపీ పాఠశాల నిర్మాణం చేయడానికి నాడు నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేయించడంతో పాటు కూడా గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మించాలన్నారు. కుసుమ కెంద గ్రామంలో రోడ్డు మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వార్డు సభ్యుడు పీ.సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కుమార్ పాల్గొన్నారు.










