ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని శీలం గొంది రోడ్డు చంపపట్టి గెడ్డ వద్ద కొట్టుకు పోయిన కాజ్ వేను పున:నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం కాజ్వే వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శాంత కుమారి మాట్లాడుతూ చంపపట్టి కాజ్‌వే హుదూద్ తుపానుకు కొట్టుకు పోయిందన్నారు. ఇప్పటివరకు పున:నిర్మించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే ఫాల్గుణ శంకుస్థాపన చేసి సుమారు ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ నిర్మించ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ డెలిగేట్ సభ్యుడు పి.చిన్నస్వామి, స్థానిక మండలం ఉపాధ్యక్షుడు బి.సులోచన, ప్రధాన కార్యదర్శి టి.భీమారావు, జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.










