
పెనమలూరు : యలమలకుదురు లాకులు సెంటర్ వద్ద ఆగిపోయిన వంతెన పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా తాడిగడప మున్సిపాలిటీ సిపిఎం పార్టీ నాయకులు ఎస్‌కె కాసిం. మాట్లాడుతూ వంతెన నిర్మాణం విషయమై అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి దష్టికి తీసుకెళ్లిన ఆయన తేదీలు చెప్తున్నారు తప్పా వంతెనపని పూర్తి అవ్వట్లేదన్నారు. గత శివరాత్రికి ముందలే వంతెన నిర్మాణం పూర్తి చేస్తానని అప్పుడు సిపిఎం పార్టీ నిరాహార దీక్ష కూర్చుంటే యనమలకుదురు వైసిపి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే వాగ్దానం చేశారని, కానీ మళ్ళీ శివరాత్రి వస్తున్న ఈ వంతెన పనులు పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. ఈ నెలాఖరుకల్లా వెంతన నిర్మాణ పనులు ప్రారంభించక పోతే నవంబర్ నెలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కార్యక్రమం చేపడతామని అన్నారు తాడిగడప మున్సిపాలిటీ సిపిఎం పార్టీ కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు, యలమలకుదురు సిపిఎం పార్టీ కార్యదర్శి ఎస్ కే ఇబ్రహీం, యనమల కుదురు పార్టీ కార్యదర్శి ఎస్‌కే బాబు, యనమలకుదురు సిపిఎం పార్టీ కార్యదర్శి మాధవ, సిపిఎం పార్టీ నాయకులు. పిల్లి వసంతరావు, ఎస్.కె సిద్దయ్య, గుంజి నరసయ్య, వాటపల్లి శ్రీరాములు పాల్గొన్నారు.