
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు బ్రిడ్జిపై చేపట్టిన మరమ్మతుల పనులను వేగవంతం చేయాలని ఎంపి మార్గాని భరత్ రామ్ ఆదేశించారు. ఆర్ అండ్ ఆర్ వంతెనపై జరుగుతున్న పను లను గురువారం ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులతో జరుగు తున్న పనులపై సమీక్ష చేశారు. బ్రిడ్జిపై గతంలో ఉన్న ప్యాచ్ వర్క్స్, థర్టీ, ఎయిటీ ఎంఎం లేయర్స్‌ను పూర్తిగా తొలగించి.. గట్టి బేస్‌ను టచ్ చేస్తూ 30 ఎంఎం బిటి రోడ్డును ఒక వైపు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. మరో వైపు కూడా రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఎంపీకి తెలిపారు. క్రోకోడయల్ జాయింట్స్, రైలింగ్, పుట్ పాత్, గెడ్డర్స్ ఏర్పాటు తదితర పనులన్నీ వచ్చే నెల 4, 5 తేదీల నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నాణ్యతమైన పనులు చేస్తుండటం వల్ల నిర్ణీత కాలం కంటే కాస్త ఆలస్యమవుతోందని, మరో 10 రోజుల్లో పనులు పూర్తవుతాయన్నారు. వంతెన నిర్మాణ పనుల వల్ల మరో 10 ఏళ్లపాటు ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మించి అరవై సంవత్సరాలు అవుతోందన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నుంచి కూడా రూ.32 కోట్లు మంజూరు అయ్యాయని, వాటితో రైల్వే శాఖ వంతెన అభివృద్ధి పనులను త్వరలో చేపట్టబోతోందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ బ్రిడ్జిని ఆనుకుని కొత్త వంతెనకు సంబంధించి డిపిఆర్ సిద్ధమైందని, 4 కిలోమీటర్ల మేర రూ.4,500 కోట్లతో కొత్త బ్రిడ్జి రాబోతోందని తెలిపారు. ఈ పర్యటనలో ఆర్‌అండ్‌బి డిఇ.ఇ.మధు సూదన్ రావు, ఎఇ సిహెచ్ సత్యమాధవి, నగర వైసిపి అధ్యక్షుడు అడపా శ్రీహరి, నాయకులు ఎన్‌వి శ్రీనివాస్, పీతా రామకృష్ణ, మార్తి లక్ష్మి, పాల్గొన్నారు.