Jun 08,2023 20:02

తెగిపోయిన వంతెన

ప్రజాశక్తి-ఆలూరు
మండలంలోని హత్తిబెళగల్‌, హర్దగేరి రహదారిలో చెరువు కట్ట వంతెన నిర్మాణం పనులు చేపట్టాలని టిడిపి జిల్లా కార్యదర్శి ఈరన్న, మైనార్టీ నాయకులు షేక్షావలీ కోరారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. రహదారిలో వంతెన వరద ధాటికి తెగిపోయిందని, రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రహదారిలో పెద్ద పెద్ద గుంతలు, కంకర తేలిన రాళ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలు కురిస్తే హత్తిబెళగల్‌, హర్దగేరి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయని చెప్పారు. వంతెన లేకపోవడంతో రైతులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే వంతెన, రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.