రాయచోటి : 'మధ్యాహ్నం భోజన కార్మికుల కష్టాలు తనకు తెలుసనని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి రూ.10 వేల వేతంన అందించి అదు కుంటాం' అని ప్రస్తుత సిఎం, అప్పటి ప్రతిపక్ష నాయకులు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా నేటికీ వారికి ఇచ్చిన హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. పైగా వారికి చెల్లించాల్సిన బిల్లులను కూడా పెండింగ్‌లో పెంటారు. సుమారు 4 నెలలుగా బిల్లులు అందక వంట ఏజెన్సీలు నానా అవస్థలు పడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో 2151 ప్రభుత్వ పాఠశాలలు, 1,32,841 మంది విద్యా ర్థులు, 3,769 మంది మిడ్డే మిల్స్ కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేస్తుండడంతో కొందరు నిర్వాహకులు అప్పు చేసి విద్యా ర్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు దుకా ణాలల్లో అప్పు పుట్టక ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్ముతో కూరగాయలు కొని పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అటు అధికా రులు, ఇటు ప్రభుత్వం మధ్నాహ్న భోజన పథకం ఏజెన్సీల బాధలు పట్టించు కోవడం లేదు. కొన్నిచోట్ల గ్యాస్ పోయిలున్నా సకాలంలో సిలిండర్ దొరక్క కట్టెలు తెచ్చి వంట వండుతున్నారు. మరికొన్ని పాఠశాలల్లో గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యి మీదనే మధ్యాహ్న భోజనం వంటకం చేస్తున్నారు. అలా వంట చేయడం వల్ల ఆ పొగ గాలి పీల్చడం వల్ల అనేక వ్యాధులు గురవుతూ ఆసుపత్రి పాలవుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వారి గురించి పట్టిం చుకోవడం లేదు. బిల్లుల కోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను వేడు కున్నా తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరించడం శోచనీయం. ప్రభుత్వం మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం పథకం పిల్లలకు అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కానీ మెనూ ప్రకారం నిత్యం భోజనం అందించాలంటే కూరగాయల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల కాలంలో ఉల్లిపాయలు రూ.30 నుండి ఒక్కసారిగా రూ.80, పచ్చిమిర్చి రూ.80 టమోటా రూ.30, కంది బేడలు రూ.150 పెరిగిపోయాయి. నూనె ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కొన్ని పాఠశాలలో ఇచ్చే వేతనం సరిపోవడం లేదని కార్మికులు వంట చేడయం మానుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలకు రుచికర భోజనం అందించాలంటూ అధికారులు జారీ చేయడమే కాకుండా అప్పుడప్పుడు తనిఖీలు చేయడం గమనార్హం. ఇది ఇలా ఉంటే కోడి గుడ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఆ పంపిణీ చేసిన గుడ్లలో కూడా చాలా గుడ్లు కాలం చెల్లినవి ఉండడం వల్ల వాటిలో చాలా వరకు కుళ్లినవి ఉంటున్నాయి. ఆ గుడ్లల్లో నిత్యం పిల్లలకు ఉడకబెట్టి ఇవ్వాల్సిన పరిస్థితి వంట చేసే వారిదే. నేతలు మారినా తమ రాతలు మాత్రం మారలేదని, ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తమకు బిల్లులు చెల్లించి, వేతనం అందించే ఆదుకోవాలని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనం పెంచాలి
ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పిల్లలకు వంట చేస్తున్నాం. ఈ పని తప్పితే వేరే పనికి వెళ్లలేకున్నాం. ప్రభుత్వం ఇస్తున్న రూ.3 వేల గౌరవేతనం సరిపోవడం లేదు. ప్రస్తుతం నిత్యావసర సరుకులు, కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వంట సామగ్రి కూడా మేమే కొనుగోలు చేయాలి. దీనివల్ల కుటుంబాలు పోషించాలంటే ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రూ.10 వేల వేతనం పెంచి ఇవ్వాలి.
- పి.మహమ్మద్ రఫీ, మధ్యాహ్న భోజన కార్మికుడు, రాయచోటి.వంట చేస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు