Jan 26,2023 23:42

కొండపై ఎగురుతున్న జెండా

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు సమీపంలో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి కొండపై గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరేపలాడింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన సందర్శకులు మువ్వన్నెల జెండా రెపరెపలాడటం చూసి కేరింతలు కొట్టారు. స్థానిక యువత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పర్యాటకులు జెండాకు సెల్యూట్‌ చేశారు.