Dec 26,2022 23:47

ఆలోచింప చేసిన 'చాప కూడు'సహపంక్తి భోజనం


పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ
ప్రజాశక్తి - ములగాడ
: పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతంలో వంగవీటి మోహనరంగా 34వ వర్ధంతిని రాయపు రెడ్డి అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలు, మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 60 వార్డు కార్పొరేటర,్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పీవీసురేష్‌, చైర్మన్‌ బలిరెడ్డి అప్పారావు, 40వ వార్డు కార్పొరేటర్‌ గుండప్ప నాగేశ్వరరావు, పారిశ్రామిక ప్రాంత కాపునాడు అధ్యక్షులు పాండురంగ జయరాజు, రేవల్‌ సత్యనారాయణ, గంగిరెడ్ల రాజు, గంట వర్మ, సతాయరావు, నారాయణ రావ, పెంటారావు, రామునాయుడు, బాలు, పారిశ్రామిక ప్రాంత కాపు నాయకులు యువత అది పాల్గొన్నారు.
సింహాచలం: 98వ వార్డు పైడితల్లమ్మ గుడి వద్దనున్న వంగవీటి రంగా విగ్రహానికి వార్డు కార్పొరేటర్‌ పివి. నరసింహం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫణి మనోహర్‌, మణిబాబు టిడిపి అధికార ప్రతినిధి సత్యవాడ శంకరరావు, జెర్రిపోతుల నరసింహమూర్తి, బంటుపల్లి రామకృష్ణ, బున్ని అప్పన్న పాల్గొన్నారు.
ఆలోచింప చేసిన 'చాప కూడు'
ఆరిలోవ : హనుమంతువాక సమీపం సంజరుగాంధీ కాలనీలో వంగవీటి మోహనరంగా 34వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక నాయకుడు సేనాపతి వెంకటేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చాపకూడు (సహపంక్తి భోజనం) ఆకట్టుకుని, ఆలోచింపజేసింది. కులాలకు అతీతంగా అందరూ కలిసి సహపంక్తి భోజనం చేసారు. వైసిపి నేత అక్కరమాని వెంకటరావు, పలు పార్టీల నేతలు రంగా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ జగ్గుపిల్ల అప్పలరాజు, ప్రజా గాయకుడు దేవిశ్రీ, వైదా నారాయణరావు, నాగేశ్వరరావు, లాయర్‌ సురేష్‌, దళిత నాయకులు పెద్దాడ రమణ, అలమండ రమణ, మధుపాడ రవి, సమయం హేమంత్‌ పాల్గొన్నారు.