
నరికేసిన వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు
ప్రజాశక్తి కంభం రూరల్
ఇటీవల పట్టణంలోని నాయక్ వీధిలో ఉన్న వందల ఏళ్ల నాటి మర్రి చెట్టును ఓ వ్యక్తి సంబంధిత ప్రభుత్వాధికారుల అనుమతి లేకుండా నరికి వేశాడు. దీంతో ఆ వీధిలో నివసిస్తున్న పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్టు నీడలో వీధిలో నివసించే వారే కాకుండా, బాటసారుల సైతం ఇక్కడ ఏర్పాటు చేసిన సిమెంటు వెంచర్లపై కూర్చొని సేద తీరేవారని ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా నరికి వేయడం ఎంతో దారుణమని ఆరోపిస్తున్నారు. పట్టపగలే చెట్టు నరికి వేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు అండదండలతోనే ఇటువంటి దుశ్చర్య కు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.