వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘన స్వాగతం
ప్రజాశక్తి - గూడూరు టౌన్ : చెన్నైలో నూతనంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గూడూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో పలువురు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ నత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. రైలుకు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఛైర్పర్సన్ పోణకా దేవసేనమ్మ , బీజేపీ నాయకులు , తదితరులు కలిసి స్వాగతం పలికారు. రైలు లో కి వెళ్లి వసతులను పరిశీలించారు. అనంతరం జెండా ఊపి వీడ్కోలు పలికారు. వందే భారత్ రైలు చూసేందుకు పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు సెల్ఫీ ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర సంస్థ కార్పొరేషన్ చైర్ పర్సన్ పోణకా దేవసేనమ్మ మాట్లాడుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా సమయం ఎంతో ఆదా అవుతుందని , త్వరితగతిన విజయవాడ, చెన్నై కు వెళ్లేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నా రు. మన రాష్ట్ర నికి రెండు రైలు మంజూరు చేసిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అనంత రం పలు పాఠశాల లకు చెందిన చిన్నారులు జాతీయ జెండాను చేపట్టి జై భారత్ అంటూ నినాదాలు చేశారు. చిన్నారులు ప్రదర్శించిన దేశ భక్తి గీతాలు , నత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. చిన్నారులను, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవసేనమ్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు , డిఆర్‌యుసిసి మెంబర్ మయూరి శ్యామ్ యాదవ్, స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర రావు , పురుషోత్తం రెడ్డి , వైసీపీ నాయకులు , గోపాల్ యాదవ్ , కోదండయ్య , విద్యార్థులు పాల్గొన్నారు.










