వంద శాతం సబ్సిడీతో పండ్ల తోటల పెంపకం : ఏపిడి
ప్రజాశక్తి - పగిడ్యాల
చిన్న సన్న కారు రైతులకు వంద శాతం సబ్సిడీతో పండ్ల తోటల పెంపకం పై అవగాహన కల్పించాలని ఏపీడి అన్వారా బేగం వాలంటీర్లకు సూచించారు. మండలంలోని నెహ్రు నగర్ గ్రామంలో సచివాలయంలో పండ్ల తోటల పెంపకం పై వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ డి మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 17 రకాల పండ్ల, పూల తోటల పెంపకం కు వంద శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. 15 రకాల పండ్ల మొక్కలు, 2 రకాల పూల మొక్కలను జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇవ్వడం జరుగుతుందన్నారు. వాలంటీర్ల పరిధిలో ఉన్న 50 ఇండ్ల లో ఉన్న సన్న చిన్న కారు రైతులకు పండ్లతోటలను పెంచుకునే విధంగా అవగాహన కల్పించాలని వాలంటీర్లకు సూచించారు. పండ్ల పూల తోటల పెంపకం పై ఎవరైనా రైతులు ఆసక్తి కనపరిస్తే వ్యవసాయ అధికారులు కానీ ఉపాధి సిబ్బందికి గాని తెలియజేయాలన్నారు. మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు పోరంబోకు స్థలాలో మొక్కలు నాకే విధంగా చర్యలు చేపట్టాలని వారి సిబ్బందికి ఆదేశించారు. ప్రభుత్వ , పాఠశాలల మైదానాలలో 100 మొక్కలకు తగ్గకుండా మొక్కలు నాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మద్దిలేటి, పంచాయతీ కార్యదర్శి వీరన్న యాదవ్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్ వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.










