బెల్లంకొండ: పొలం గట్లపై నాటేందుకు వందశాతం రాయితీపై కంది విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మండల ఎంపిపి సి హెచ్ పద్మా వెంకటేశ్వరరెడ్డి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా బెల్లంకొండ మండల పరిషత్ కార్యాలయ ప్రాం గణంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖాధికారి డి.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి రైతు తమ కుటుంబ అవ సరానికి సరిపడా కందులు వారి పొలాల గట్లపైనే కంది సాగు చేసి పండించుకోవాలని సూచించారు. ఒక హెక్టారు పైరు చుట్టూ గట్ల మీద వేసుకొనేందుకు ఒక కిలో కందులు సరిపోతాయని, వంద శాతం రాయితిపై వీటిని ఆయా గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో పంపిణికి సిద్ధంగా ఉన్నా యని, మండలానికి మొత్తం 1600 కిలోలు పంపిణీ చేయ నున్నట్లు చెప్పారు. కందివిత్తనాలు కావాల్సిన రైతులు వారి ఆధార్, మొబైల్ నెంబర్, పాసుబుక్ కాపీలతో ఆయా గ్రామ రైతు భరోసా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలని సూచిం చారు. ఇదిలా ఉండగా, మండలంలోని కందిపాడు గ్రామ సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ఎంపిపి ప్రారంభించారు. అనంతరం వాలంటీర్లు, గృహసారథులతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.










