ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన నిర్మాణాలను వంద శాతం పూర్తి కావాల్సిందేనని ఆలూరు ఆర్‌డబ్ల్యుఎస్ డిఇఇ మల్లికార్జున సంబంధిత కాంట్రాక్ట్‌దారులను ఆదేశించారు. సోమవారం ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ రామనీలా ఆధ్వర్యంలో చిప్పగిరితో పాటు తిమ్మాపురం గ్రామంలోని పాఠశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. అందుకు విరుద్ధంగా ఆలస్యం చేయడం మంచిది కాదని ఆయా పాఠశాలల సిబ్బందిని, కాంట్రాక్ట్‌దారులను హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు అన్ని వసతులూ ఉంటేనే మక్కువ చూపిస్తారని తెలిపారు. వేరే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో బాగున్నాయని ఇక్కడే చేరేందుకు మక్కువ చూపుతారన్నారు. ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిదని సిబ్బందికి సూచించారు.
తిమ్మాపురంలో నిర్మాణంలో ఉన్న పాఠశాలను పరిశీలిస్తున్న ఆర్‌డబ్ల్యుఎస్ డిఇఇ మల్లికార్జున










